దారుణం.. చాక్లెట్ ఇచ్చి బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మూలకండ్రిగలో చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు బలరామయ్య అత్యాచారానికి పాల్పడ్డారు...

Update: 2024-07-13 04:24 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఏర్పేడు మండలం మూలకండ్రిగలో చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు బలరామయ్య అత్యాచారానికి పాల్పడ్డారు. చాక్లెట్ ఇప్పిస్తానని బాలికపై దారుణానికి ఒడిగట్టారు. నొప్పి బాధపడుతున్న బాలికను ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించారు. నొప్పి భరించలేదక తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో అసలు విషయం బయటపడింది. బాలికను రేణిగుంటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులకు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బలరామయ్య కోసం గాలిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో నిందితుడు గ్రామం వదిలి పారిపోయారు. నిందితుడిని వదిలిపెట్టొద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News