AP:ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధానికి కఠిన చర్యలు:టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్
శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లు నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు
దిశ ప్రతినిధి, తిరుపతి:శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లు నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం పై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషనల్ టీమ్ లతో అభిప్రాయ సేకరణ చేసి, ఆపరేషన్ విధానాలు తెలుసుకున్నారు. సమాచారం పొందే విధానం నుంచి స్మగ్లర్లను పట్టుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ఆపరేషనల్ టీమ్స్ వివరించారు.
స్మగ్లర్లను నిరోధించడానికి మరిన్ని వ్యూహాలను చేపట్టాల్సి ఉందని సూచించారు. ఇప్పటి వరకు టీమ్స్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ, మరింత ముందుకు వెళ్లడానికి తీసుకోవాల్సిన విధానాల గురించి సూచనలు చేశారు. ప్రతి అధికారి చేపడుతున్న విధులను తెలుసుకొని, వారికి సూచనలు అందజేశారు. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికంగా చేపడుతున్న సమాచార వ్యవస్థ గురించి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆయనకు కడప, రైల్వే కోడూరు, సాని పాయ సబ్ కంట్రోల్ ల నుంచి జరుగుతున్న ఆపరేషన్ విధానాలు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ వివరించారు. బేస్ క్యాంపులు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల గురించి తెలియజేశారు.
Nara Lokesh:ఒమన్‌లో చిక్కుకొని మహిళ ఆవేదన..రంగంలోకి మంత్రి లోకేష్