Tirumala: రికార్డు స్థాయిలో ఆదాయం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ...
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎండలు మండుతున్నా కుటుంబ సభ్యులతో వచ్చి వెంకన్న సేవలో పాల్గొంటున్నారు. మొక్కులు తీర్చుకుని భారీగా కానుకలు సమర్పించారు. దీంతో శ్రీవారి ఆదాయం రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. మార్చి నెలలో అయితే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 118.49 కోట్ల ఆదాయం సమకూరింది. 2022 మార్చి నెల నుంచి శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ అందుకుంటోంది. మార్చి నెల ఏకంగా రూ. 118.49 కోట్లు వచ్చాయి.
ప్రస్తుతం తిరుమలలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజరోహనం నిర్వహించారు. కొద్ది సేపటి క్రితం పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 వరకూ కొనసాగనున్నాయి.