రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలని శ్రీవారిని ప్రార్థించ:మాజీ మంత్రి నారాయణ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించినట్లు మాజీ మంత్రి నారాయణ తెలిపారు.
దిశ, తిరుమల: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించినట్లు మాజీ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీడీపీకి అనుకూలంగా వచ్చాయని, భగవంతుడి దయతో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీడీపీ అధికారంలోకి వస్తాయని తేల్చాయన్నారు. 53 శాతం ఓట్ల షేరింగ్‌తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే కసి ప్రజల్లో కనిపించిందని తెలిపారు. పోస్టల్ ఓట్లు కూడా 90 శాతం ఏకపక్షంగానే వేశారని అన్నారు. పోలింగ్ రోజు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు ఏపికి పోతెత్తారన్నారు. పోలింగ్ శాతం పెరగడం చూస్తే ప్రభుత్వం పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలియజేశారు.