దసరా రోజు భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఇద్దరు నేతల మధ్య ఘర్షణ

శ్రీకాళహస్తిలో పండుగ రోజు రాజకీయ కక్షలు బయటపడ్డాయి...

Update: 2024-10-12 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి(Srikalahasti)లో పండుగ రోజు రాజకీయ కక్షలు బయటపడ్డాయి. చాముండేశ్వరి ఆలయం వద్ద అధికార, విపక్ష నేతల(Ruling and Opposition leaders) మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. శ్రీకాళహస్తీ పురపాలక సంఘం మాజీ చైర్మన్ పార్థసారథి(Srikalahasti Municipal Corporation former chairman Parthasarathy), ఆలయ కమిటీ చైర్మన్ పులి రామచంద్రయ్య(Chamundeshwari Temple committee Chairman Puli Ramachandraiah) గతంలో మిత్రులుగా ఉండేవారు. అయితే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరిగాయి. దీంతో శత్రువులుగా మారారు. ఈ రోజు చాముండేశ్వరి ఆలయం వద్ద ఎదురుపడటంతో పార్థసారథి, పులి రామచంద్రయ్య వాగ్వాదానికి దిగారు. పరస్పరం బూతులు తిట్టుకుంటూ రోడ్డుపై హల్ చల్ చేశారు. ఇద్దరి అనుచరులు సైతం ఘర్షణకు దిగారు. పరస్పరం దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమనిగించారు. 


Similar News