ఏమైంది జగన్ ఇన్నేళ్లయినా రాలేదు: Nara lokesh

‘పాద‌యాత్రలో ప్రజ‌ల స‌మ‌స్యలు చూస్తున్నాను. వారి క‌ష్టాలు వింటున్నాను. జ‌గ‌న్ రెడ్డి జ‌నాల‌కి చేసిన మోసాలు ప్రతీచోటా సాక్ష్యాలుగా క‌నిపిస్తున్నాయి. ...

Update: 2023-02-25 13:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘పాద‌యాత్రలో ప్రజ‌ల స‌మ‌స్యలు చూస్తున్నాను. వారి క‌ష్టాలు వింటున్నాను. జ‌గ‌న్ రెడ్డి జ‌నాల‌కి చేసిన మోసాలు ప్రతీచోటా సాక్ష్యాలుగా క‌నిపిస్తున్నాయి.దిశ చ‌ట్టమే అస‌లు లేదు. దిక్కూ మొక్కూలేని దిశ చట్టానికి మళ్లీ పోలీస్ స్టేషన్లా’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు దిశ పోలీస్ స్టేసన్ దగ్గర సెల్పీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.‘రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై దాడుల‌కి పాల్పడితే 21 రోజుల్లో నిందితుల్ని శిక్షించే దిశ చ‌ట్టం తెచ్చామ‌ని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో వంద‌లాది యువ‌తులు, మ‌హిళ‌లు మృగాళ్ల దురాగ‌తాల‌కు బ‌ల‌య్యారు. నేషనల్ క్రైమ్​ బ్యూరో రికార్డుల ప్రకారం ఏపీలో ప్రతీ 45 నిమిషాలకి ఒక మ‌హిళ‌పై దాడి జ‌రుగుతోంది. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో సుమారు 2,500 మందికి పైగా మ‌హిళ‌లపై అఘాయిత్యాలు జ‌రిగాయి.

అయితే ఇప్పటివ‌ర‌కూ మ‌హిళ‌ల‌పై దాడిచేసిన నిందితుల‌లో ఒక్కరిపైనా కూడా దిశ‌ చ‌ట్టం కింద‌ కేసు పెట్టలేదు. అంటే చ‌ట్టమే లేద‌ని తేలిపోతోంది. లేని చ‌ట్టానికి దిశ పోలీస్ స్టేష‌న్లు మాత్రం పెట్టారు. జ‌గ‌న్ చేసిన వంద‌ల మోసాల్లో ఇదొక మోసం. గ‌న్ కంటే ముందొస్తాడ‌న్న జ‌గ‌న్ ఇన్నేళ్లయినా రాలేదు. 21 రోజుల్లో నిందితుల‌కు శిక్ష అన్నారు. ఒక నిందితుడిపైనైనా దిశ‌చ‌ట్టం కింద కేసు క‌ట్టలేదు. నా పాద‌యాత్ర తిరుప‌తి ప‌ట్టణం రైల్వేస్టేష‌న్ రోడ్డులో సాగుతుండ‌గా దిశ పోలీస్ స్టేష‌న్ క‌నిపించింది. సెల్ఫీ తీశాను. జ‌గ‌న్ రెడ్డి మ‌రో ఏడాదిలో ఇంటికెళిపోతున్నారు. మీరు తెచ్చాన‌ని చెబుతున్న దిశ చ‌ట్టం ఏ దిక్కుకు పోయిందో చెబుతారా?’ అంటూ లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News