Ap News: చంద్రబాబు ఇలాకలో రంగంలోకి పెద్దిరెడ్డి.. ఆయనకు ఏకంగా మంత్రి పదవి ఆఫర్

కుప్పం నియోజకవర్గంలో భరత్‌ను గెలిపిస్తే అయన మంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ...

Update: 2023-06-27 12:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కుప్పం నియోజకవర్గంలో భరత్‌ను గెలిపిస్తే అయన మంత్రి అవుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేగా భరత్‌ను, ఎంపీగా రెడ్డప్పను గెలిపించి తద్వారా సీఎం వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో పల్లెబాట నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా సురక్ష కార్యక్రమంలో తెలపాలని సూచించారు. వివక్ష లేకుండా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. తమకు ఓటు వేయకపోయినా వారు పేదలయితే చాలు పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు చేశారని, వారి పార్టీకి సంబంధించిన వారికే పథకాలు అందేవి, లంచాలు ఇస్తే పథకాలు లభించేవి అని పెద్ది రెడ్డి గుర్తు చేశారు. నేడు సీఎం వైఎస్ జగన్ పాలనలో మధ్యవర్తులు లేకుండా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ , చంద్రబాబు పాలనలో తేడాలు గమనిస్తే ప్రజలు వైసీపీ వెంటే ఉంటారన్నారు. ఎన్నికల హామీలు 99.5 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

Read More..

Nellore: అజ్ఞాతం వీడిన మాజీమంత్రి.. పాలిటిక్స్‌లో మళ్లీ షురూ  

Tags:    

Similar News