టీటీడీకి ఎంఈఐఎల్ కానుక.. 10 బస్సుల అందజేత

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంఈఐఎల్ సంస్థ 10 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా అందించింది.

Update: 2023-03-27 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంఈఐఎల్ భారీ కానుక అందజేసింది. తిరుమల భక్తుల కోసం 10 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా అందించింది. అక్టోబర్​ 21, 2022న ఇచ్చిన హామీ మేరకు 10 ఈ-బస్సులను సిద్ధం చేసి సోమవారం టీటీడీకి అందజేసింది. వేద పండితుల ప్రత్యేక పూజల అనంతరం ఈ భాదీ విరాళాన్ని ఒలెక్ట్రా సీఎండీ కె.వీ ప్రదీప్.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డికి అందించారు. అనంతరం సిబ్బందితో కలిసి బస్సులో కొద్ది దూరం ప్రయాణించి.. బస్సుల పనితీరు పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది.

‘మేక్​ ఇన్​ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమాల పేరు మీదుగా టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది. వీటిని సమయానికి పుణ్యక్షేత్రానికి అందిచడానికి ఎంఈఐఎల్ కృషి చేసింది. సుమారు రూ.18కోట్ల విలువైన 10ఈ-బస్సులను ఉచితంగా అందించింది. ఈ బస్సులు భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించనున్నాయి. ఇవి వాయు, శబ్ధ కాలుష్యం తగ్గించి.. టీటీడిని క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌గా మార్చనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

Tags:    

Similar News