Ap News: చంద్రగిరి పోలీస్‌స్టేషన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద వ్యక్తం ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు.
దిశ, చంద్రగిరి: చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద వ్యక్తం ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.విజయవాడకు చెందిన మణికంఠకు దుర్గాతో వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. భార్య దుర్గా కాపురానికి రాలేదని ఆవేదనతో పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని మణికంఠ నిప్పు అంటించుకున్నారు. అయితే పోలీసులు మంటలార్పి ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.