Srikalahasti: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు....

Update: 2023-04-24 13:38 GMT
Srikalahasti: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..   ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
  • whatsapp icon

దిశ, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరికి పెద్దలు వేర్వేరుగా వివాహాలు చేశారు. అప్పటి నుంచి కూడా వేర్వేరుగా ఉండలేక కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్వర్ణముఖి నదిలో దూకారు. అయితే సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ కానిస్టేబుల్ కన్నయ్య వెంటనే నదిలో దూకి వారిద్దరినీ కాపాడారు. అనంతరం పోలీస్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. అయితే ప్రాణాలకు తెగించి యువతీయువకుడిని కాపాడిన కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. 

Tags:    

Similar News