మాట వినడంలేదు.. టీటీడీ అధికారుల తీరుపై కడప ఎమ్మెల్యే ఆగ్రహం

టీటీడీ అధికారుల తీరుపై కడప ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-07-14 17:08 GMT

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ అధికారులు ప్రజా ప్రతినిధుల మాట వినడంలేదని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం తిరుమలను పూర్తిగా అవినీతి మయం చేసిందని మండిపడ్డారు. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. భక్తుల అన్న ప్రసాదాల్లో నాణ్యాత పెంచాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల అంధకారం తర్వాత రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. 


Similar News