‘రాష్ట్రంలో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయ్’..మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని, 13 వేల గ్రామ పంచాయతీలకు, 150 మున్సిపాలిటీలకు సీఎం, డిప్యూటీ సీఎంలు 15 వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Update: 2024-08-22 14:59 GMT

దిశ,తిరుమల:రాష్ట్రంలో పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని, 13 వేల గ్రామ పంచాయతీలకు, 150 మున్సిపాలిటీలకు సీఎం, డిప్యూటీ సీఎంలు 15 వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని ప్రార్ధించానని చెప్పారు. ఇక చంద్రబాబు హయాంలో గ్రామాలకు మళ్లీ స్వర్ణయుగం వచ్చిందని, జన్మభూమి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా 3.50 లక్షల గ్రామీణ ప్రజలు కనీస సౌకర్యాలు పొందుతారని తెలిపారు.


Similar News