AP News:తిరుమలలో పట్టుబడ్డ నకిలీ ఐఏఎస్ అధికారి

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన నరసింహారావు తాను ఐఏఎస్ అధికారినంటూ..తనకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ అదనపు ఈవో కార్యాలయంలో దర్శనానికి లేఖను దరఖాస్తు చేశారు.

Update: 2024-04-11 13:58 GMT

దిశ, తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన నరసింహారావు తాను ఐఏఎస్ అధికారినంటూ..తనకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలంటూ అదనపు ఈవో కార్యాలయంలో దర్శనానికి లేఖను దరఖాస్తు చేశారు. నరసింహారావు వైఖరి పై అదనపు ఈవో కార్యాలయం సిబ్బందికి అనుమానం రావడంతో..వారు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా..నరసింహారావు పై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నరసింహారావు ఐఏఎస్ కాదని నిర్దారించారు.

అతని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు నరసింహారావుని విచారిస్తున్నారు. నరసింహారావు తన కారుపై కూడా ఐఏఎస్ లోగోతో పాటు నెంబర్ ప్లేట్ పై జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అన్ని వేసుకొని ఉండడంతో అతని కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా గుంటూరు,విజయవాడలో ఇదే తరహాలో నరసింహారావు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.


Similar News