తిరుమలలో మరోసారి చిరుత కలకలం..భయాందోళనలో భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు తిరుమలకు వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నడకదారిలో వెళ్లే భక్తులను గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Update: 2024-05-15 09:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు తిరుమలకు వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. నడకదారిలో వెళ్లే భక్తులను గుంపులుగా వెళ్లాలని సూచించారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

దీంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ కూడా భక్తులు రక్షణ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక మార్గంలో రాత్రి 10 గంటల తర్వాత ఎవరినీ అనుమతించడం లేదు. ఉదయం ఆరు తర్వాతే అనుమతిస్తారు. అంతేకాదు 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి లేదు. టీటీడీ చిరుతల నుంచి రక్షణ పొందేందుకు భక్తులకు కర్రలను పంపిణీ చేస్తోంది.


Similar News