తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం
శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు తిరుమలకు చేరుకుంటున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుమలలో ఆదివారం యాత్రికుల రద్దీ భారీగా నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో యాత్రికులు బారులుతీరారు. క్యూ లైన్లలో ఉన్న యాత్రికులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.