Chittoor: టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్
చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు..
దిశ, చిత్తూరు: చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే కార్పొరేటర్లు పార్టీ మారడంపై జిల్లా అధ్యక్షుడు భరత్ సీరియస్ అయ్యారు. టీడీపీలోకి చేరిన కార్పొరేటర్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు భరత్ పేర్కొన్నారు.