విషమించిన కందారపు మురళి ఆరోగ్యం.. వైద్యుల కీలక సూచన

టీటీడీ అటవీ కార్మికుల మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు...

Update: 2024-01-29 15:31 GMT

దిశ, తిరుపతి ప్రతినిధి: టీటీడీ అటవీ కార్మికుల మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు. అయితే ఆయనతో పాటు అటవీ కార్మికుల ఆరోగ్యం మరింత విషమించిందని, వెంటనే దీక్ష విరమించి చికిత్స చేసుకోవాలని రుయా వైద్య బృందం డాక్టర్లు హారిక ,ఉష పృథ్విలు ప్రకటించారు. సోమవారం రాత్రి 8:30 గంటలకు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న వైద్య బృందం కార్మిక నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటనే చికిత్స చేయకుంటే సృహ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు. ఫిట్స్ వచ్చే అవకాశం లేకపోలేదని ప్రకటించారు. అయితే అటవీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు తాము దీక్ష విరమించుకోమని, అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి వెనకాడబోమని కందాల మురళి హెచ్చరించారు.

Tags:    

Similar News