ఎప్పటికీ పెద్దిరెడ్డి వెంటే ఉంటా: YCP leader Shafi
పీలేరు సర్పంచ్ పదవి ఇవ్వకపోయినా పెద్దిరెడ్డి కుటుంబానికి ఎప్పుడూ విధేయంగా ఉంటానని చిత్తూరు జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షఫీ తెలిపారు....
దిశ, పీలేరు: పీలేరు సర్పంచ్ పదవి ఇవ్వకపోయినా పెద్దిరెడ్డి కుటుంబానికి ఎప్పుడూ విధేయంగా ఉంటానని చిత్తూరు జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షఫీ తెలిపారు. విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత సర్పంచ్ ఎన్నికల సమయంలో తన సతీమణికి రెండున్నర సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవి ఇస్తారని వాగ్దానం చేశారని, అయితే గడువు పూర్తి అయినా ఇవ్వలేదని, దానికి తోడు కొందరు డబ్బులకు అమ్ముడు పోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని షఫీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అలాంటి వ్యక్తిని కానని, 2014లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు పీలేరులో వైఎస్సార్‌కు బలం లేనప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో తాను సర్పంచ్‌గా పోటీ చేశానని గుర్తు చేశారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, 35 సంవత్సరాలుగా పెద్దిరెడ్డితో రాజకీయం చేశానని భవిష్యత్తులో సైతం వారి వెంటే ఉంటానని షఫీ స్పష్టం చేశారు.