Tirupati: భయం.. భయం.. గుప్పిట్లో ప్రాణాలు!
చిత్తూరు జిల్లా ప్రజలను గజరాజుల భయం వెంటాడుతోంది. ..
దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లా ప్రజలను గజరాజుల భయం వెంటాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు హల్‌చల్ చేస్తున్నాయి. పంట పొలాల వద్ద బీభత్సం సృష్టించడంతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకున్న పరిస్థితి. తాజాగా రామకుప్పం మండలం పీఎం తండా గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. పొలాలపై దాడి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో భారీగా పంట నష్టం ఏర్పడింది. చేతికొచ్చే పంట ఏనుగుల గుంపు నాశనం చేయడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 బస్తాల బంగాళదుంప పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయని రైతన్నలు ఆవేదన చెందారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన పంట పొలాలను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏనుగుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు స్పందించిన ఏనుగుల గుంపు పంట పొలాలవైపు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు వినతి చేస్తున్నారు.