Call Money: వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం.. అవమానంతో వెళ్లిపోయిన మహిళ

చిత్తూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది...

Update: 2023-03-09 11:35 GMT

దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫీరాన్ సాహెబ్ స్ట్రీట్‌లో ఉంటోన్న పర్వీన్‌ బేగం కొంత డబ్బు వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నారు. సకాలంలో వడ్డీ కట్టలేదని ఇంటికి తాళం వేశారు వ్యాపారులు. రోజు వడ్డీ కోసం వేధిస్తున్నారని జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయడంతో వడ్డీ రాక్షసులు మరింతగా రెచ్చి పోయారు. పర్వీన్‌ బేగం పిల్లలు తమకు రేపటి నుంచి పరీక్షలని.. పరీక్షకు హాజరు కావాల్సిన ఉందని.. ఇంటికి తాళాలు వేయొద్దని కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు.

కనికరించని కాల్ మనీ కంత్రీగాళ్లు

అయినప్పటికీ వడ్డీవ్యాపారుల హృదయాన్ని పిల్లల అభ్యర్ధన కరిగించలేదు. వారు కనికరించలేదు. తన ఇంటికి తాళం వేయడం అవమానకరంగా భావించిన పర్వీన్ బేగం రెండ్రోజుల నుంచి కనిపించకుండా పోయారు. దీంతో తమ తల్లి కనిపించక లేదంటూ పోలీసులను పర్వీన్ పిల్లలు ఆశ్రయించారు. కాల్ మనీ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పోలీసులతో ఇంటి తాళాలు తెరిపించి వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కేసు నమోదుకు ఆదేశించారు.

Tags:    

Similar News