తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Update: 2024-07-17 09:28 GMT

దిశ,తిరుమల:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ పై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.

అస్తవ్యస్తమైన ఎక్సైజ్ పాలసీని గాడిన పెడుతున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవకతవకలపై శ్వేత పాత్రలు విడుదల చేశామన్నారు. మరో మూడు శాఖలపై శ్వేతాపత్రాలు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు. అన్ని శాఖల్లో ప్రక్షల చేయాల్సి ఉందన్నా ఆయన ధనార్జన ధ్యేయంగా గత ప్రభుత్వం అన్ని శాఖలను అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. రాష్ట్రం., రాష్ట్ర ప్రజల కోసం స్వచ్ఛమైన పాలన అందించడమే చంద్రబాబు ప్రథమ ధ్యేయమన్నారు. భూ హక్కు చట్టం ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి వాటిపై తిరుమలలో మాట్లాడటం సమంజసం కాదని ఆయన అన్నారు.


Similar News