ఈ నెల 16న UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ఈ నెల 16వ తేదీన ఆదివారం యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Update: 2024-06-14 13:27 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: ఈ నెల 16వ తేదీన ఆదివారం యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు ఈ నెల 16వ తేదీన జరగనున్న UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16న ఆదివారం ఈ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 5518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకొరకు 11 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారి(తహశీల్దార్), 11 చీఫ్ సూపరింటెండెట్స్, 5 మంది జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారని , తిరుపతి ఆర్.డి.ఓ పరీక్ష పేపర్ కస్టోడియన్‌గా వ్యవహరించనున్నారని అన్నారు.

ఆదివారం ఉదయం 9.30 AM నుంచి 11.30 AM , మధ్యాహ్నం 2.30 PM నుంచి 4.30 PM వరకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహణ ఉంటుందని పరీక్షల సమయానికి 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేస్తారని ఆ పై ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐ.డి కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు.


Similar News