తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్..
తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున శిలా తోరణం వద్ద సంచరించిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇనుప కంచెను, చెట్లను నేల కూల్చి పార్క్ అంతా ధ్వంసం చేసి వెళ్లాయి.
దిశ, తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున శిలా తోరణం వద్ద సంచరించిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇనుప కంచెను, చెట్లను నేల కూల్చి పార్క్ అంతా ధ్వంసం చేసి వెళ్లాయి. ఏనుగులు పార్క్‌లోకి రావడంతో శ్రీవారిపాదలు, శిలాతోరణం దర్శనానికి వచ్చిన భక్తులు కంగారు పడ్డారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి అవి శిలతోరణం వద్దకు రాకుండా రక్షణ చర్యలు చేపట్టారు.
ఏనుగుల సంచారంతో అప్రమత్తమైన టీటీడీ , విజిలెన్స్ అధికారులు ఆ మార్గంలో వెళ్లే వాహన దారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. గతంలో ఎలుగుబంటి, పులి ఇక్కడ సంచరించడంతో వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏనుగుల గుంపు శిలా తోరణంకు రావడంతో వాహనదారులతో పాటు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి అపాయం జరగకుండా టీటీడీ అటవి శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.