నేడు నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి!
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్.. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా విదేశాల్లో చదువుకుంటున్న ఈ పథకానికి అర్హులైన విద్యార్థులకు ఫీజు మొత్తాన్నీ ప్రభుత్వమే భరించేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. పేద విద్యార్థులు నాణ్యమైన విదేశీ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో జగన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్ల రూపాయలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు కోటి రూపాయల వరకు మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తుంది. ఇందులో విమాన ఛార్జీలు, వీసా చార్జీలు కూడా ఉంటాయి.
అయితే నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఆన్‌లైన్ విధానంలో నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ పథకం కింద చదువుకుంటోన్న 390 మంది స్టూడెంట్స్ అకౌంట్లలో రూ. 42. 60 కోట్లు జమ చేయనున్నారు. అలాగే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన 95 మంది సివిల్ సర్వీస్ అభ్యర్థులకు, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన 11 మంది అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాలను కూడా జగన్ విడుదల చేయనున్నారు.