లోకేష్ విచారణ జరుగుతుండగా కీలక పరిణామం.. దర్యాప్తు అధికారి మార్పు
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిని ప్రభుత్వం మార్చడం కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఏఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఆయనను ప్రభుత్వం తప్పించింది. జయరామరాజు స్థానంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారిగా డీఎస్పీ విజయ్ భాస్కర్‌ను నియమించింది.
దర్యాప్తు అధికారి మార్పుకు సంబంధించి ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. జయరామరాజుకు పనిభారం ఎక్కువ కావడంతో మార్చినట్లు ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఇవాళ ఉదయం నుంచి సీఐడీ విచారిస్తోంది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారిని మార్చడం కీలకంగా మారింది. ఉదయం 10 గంటలకు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టనున్నారు.