సీఐడీ పేరును జేపీఎస్‌గా మార్చుకోండి: సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ
నిరాధారణ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : నిరాధారణ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 23 రోజులు గడుస్తున్నా సీఐడీ ఇప్పటి వరకు సరైన ఆధారాలు సేకరించలేదని అన్నారు. ఇప్పటికీ ఆధారాల కోసం వెత్తుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని కేశినేని భవన్ వద్ద ‘సత్యమేవ జయతే దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఐడీ పేరు మార్చుకుంటే బెటర్ అని సూచించారు. అంతేకాదు జేపీఎస్‌గా నామకరణం చేశారు. జగన్ ప్రైవేట్ సైన్యం గా పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ సూచించారు. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల హతస్తం ఖచ్చితంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు.