AP Govt:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..ఆ పథకాల పేర్లు మార్పు
ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఘన విజయం సాధించింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖలోని ఐదు పథకాల పేర్లను మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలోని ఐదు పథకాల పేర్లు మారుస్తు ఉత్తర్వులిచ్చింది. ‘అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం’, ‘జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా, ‘జగనన్న గోరు ముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, ‘నాడు-నేడు పథకాన్ని మన బడి-మన భవిష్యత్’ గా, ‘స్వేచ్ఛ’ పేరును ‘బాలికా రక్ష’గా , ‘ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’ గా మార్చింది.