మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ఇంటలిజెన్స్ రిపోర్ట్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే!
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం జగన్‌ను ఓడించాలని ఎడ్డీఏ కూటమి, రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం జగన్‌ను ఓడించాలని ఎడ్డీఏ కూటమి, రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై ఇంటెలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన ఎన్నికల రిపోర్ట్ సంచనలంగా మారింది. ఈ రిపోర్ట్‌లో మరోసారి సంపూర్ణ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. వైసీపీకి 124 వస్తాయని పేర్కొనగా.. ఎన్డీయే కూటమిని 51 సీట్లకే పరిమితం చేసింది. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ఫేక్ సంస్థను వైసీపీ తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకోవడంతో నిద్రపట్టక నకిలీ సంస్థను ఆశ్రయించారని విమర్శించారు. ఈ నకిలీ సర్వేలను, నకిలీ రిపోర్టులను, వీడియోలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. తప్పుడు వీడియోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని సర్వే సంస్థలు జగన్‌కు అనుకూలంగా రిపోర్ట్‌లు విడుదల చేసినా ప్రజల మనసుల్లో పాతుకుపోయిన విషయాన్ని మార్చలేవని అన్నారు. కూటమికి పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు. జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమన్నారు.