చంద్రబాబు ఆస్తులు, వ్యాపారాలే టార్గెట్‌గా పేర్ని నాని సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు...

Update: 2023-10-06 13:08 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను సీఐడీ నిందితుడిగా చేర్చింది. దీంతో నారా లోకేశ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎవరిని మేనేజ్ చేయడానికి వెళ్లారని నిలదీశారు. టీడీపీకి మాత్రమే మేనేజ్ చేయడం తెలుసని ఎద్దేవా చేశారు. దొరకనంత వరకూ అందరూ దొరలేనని చెప్పారు. అడవికి న్యాయం చేస్తున్నానని వీరప్పన్ కూడా చెప్పారని గుర్తు చేశారు. 40 ఏళ్లలో చంద్రబాబు ఇప్పుడే దొరికారని, ఇప్పటివరకు దొరకనంత మాత్రాన దొర అయిపోరుకాదా అని ప్రశ్నించారు. లోకేశ్ మాత్రం ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ఆస్తులు, వ్యాపారాలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజాయితీ పరులైతే విచారణకు రావాలన్నారు. దమ్ముంది కాబట్టే సీఎం జగన్ పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నారని తెలిపారు. బీజేపీ కంటే చంద్రబాబునే ముఖ్యమని పవన్ తేల్చిచెప్పారన్నారు. పవన్ కల్యాణ్‌లా జగన్ రోజుకోమాట మాట్లాడరని స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు పవన్ ఆటవిడుపు యాత్ర చేశారని పేర్ని నాని సెటైర్ వేశారు.

Tags:    

Similar News