పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మధన్యమైంది: పిఠాపురం వర్మ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడనలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

Update: 2024-06-19 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడనలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.ఆ సమయంలో పిఠాపురం టీడీపీ నేత, పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మ పవన్ కల్యాణ్ ను అభినందించారు. అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాన్ ను ఏపీ డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మ ధన్యమైంది. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కలయిక రామలక్ష్మణుల కలయిక అని.. వారిద్దరూ కలిసి ఈ రాష్ట్రానికి రామ రాజ్య పాలన అందిస్తారన్నారు. వారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వర్మ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తన సీటును వదులుకోవడమే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపుకోసం అహర్నిషలు కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కల్యాణ్.. తన విజయం పిఠాపురం ప్రజలకు, వర్మకు అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read: వదిన ఇచ్చిన రూ. లక్షలపెన్నును కాదని.. రూ.10 పెన్నుతో సంతకం చేసిన డిప్యూటీ సీఎం పవన్

Tags:    

Similar News