చంద్రబాబు నాయుడు ఏం తింటారో తెలుసా?.. 70 ఏళ్లు నిండినా ఇంత ఎనర్జీగా దాని వల్లే!
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్నారు. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వయస్సు ప్రస్తుతం 74 ఏళ్లు. అయినా ఈ ఏజ్‌లో కూడా ఇంత చురుగ్గా ఓ పార్టీని నడిపిస్తున్నారంటే మామూలు విషయం కాదంటూ చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి కారణమేంటని జనాలు.. ఆయన డైట్ ఫాలో అవుతారా? ఏం ఎక్కువగా తింటారో ఆరా తీయడం మొదలుపెట్టారు. చంద్రబాబు స్వయంగా తాను ఏం తింటారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తను బతకడం కోసం తింటాను తప్ప.. తినడం కోసం బతకనని చెప్పుకొచ్చారు. ఆయన తీసుకునే ఫుడ్ చాలా సింపుల్‌గా ఉంటుందని తెలిపారు. కేవలం హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని వెల్లడించారు. ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు కూడా వేసుకుంటానని చెప్పారు. అంతేకాకుండా ప్రతిరోజూ ఆరు నుంచి ఏడు గంటల నిద్ర పోతానని చెప్పారు. డైట్ ఫాలో అవుతూ వాకింగ్ అండ్ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని అన్నారు. తిన్న ఫుడ్స్ బట్టి ఒక్కోసారి వ్యాయామాలు కూడా మారుస్తారట.
చంద్రబాబు నాయుడు తినే డైట్ చాట్..
ఉదయం: ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, రెండు దోశలు, కొద్దిగా చట్నీ, రెండు ఉడకబెట్టిన గుడ్లు. వీటిల్లో ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. అలాగే బ్రేక్ ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో ఓ పండు కూడా తింటారు.
మధ్యాహ్నం: రాగి, జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలు లేదా అన్నం, రెండు కూరలు. నూనె ఎక్కువగా లేని ఫుడ్.
సాయంత్రం: స్నాక్స్‌కు కొన్ని నట్స్ లేదంటే జ్యూస్. ఏదైనా ఒక సూప్, ఎగ్ వైట్ తీసుకుంటారు.
రాత్రి: ఇక నైట్ పడుకునే ముందు కేవలం ఒక గ్లాస్ పాలు మాత్రమే. మరీ ఎక్కువగా ఆకలి అనిపిస్తే ఒక చిన్న పండు తింటారట.