AP Political News: ఆంధ్రాలో ఎన్నికల కోడ్.. ఆ అంశంలో చంద్రబాబు అలెర్ట్..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.దీనితో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలెర్ట్ అయ్యారు. గతంలో పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాలు కేటాయించడంలో తాను తప్పటడుగు వేసినట్లు నారా చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల వివరాల ప్రకారం బీజేపీ, జనసేనతో పొత్తులో భాగంగా గతంలో 175 స్థానాలకు గాను 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
అలానే బీజేపీకి10 స్థానాలు, జనసేనకు 21 స్థానాలు టీడీపీ అధిష్టానం కేటాయించింది. అయితే బీజేపీకి, జనసేనకు కేటాయించిన సీట్ల కారణంగా టీడీపీకి సమస్యలు వెల్లువెత్తుతున్నాయని చంద్రబాబుకు నివేదికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు జాబితాల విడుదలలో, బీజేపీ, జనసేనకు సీట్లను కేటాయించడంలో తప్పటడుగులు వేసినట్లు చంద్రబాబు భావిస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
అయితే ఇప్పటికే జనసేన, బీజేపీకి కేటాయించిన సీట్లల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీనితో భవిష్యత్తులో విడుదల చేయనున్న మూడవ జాబితాపై బాబు ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి ఒకటి, బీజేపీకి పది, జనసేనకు ఐదు మొత్తం పదహారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
అయితే బీజేపీకి, జనసేనకు కేటాయిస్తామన్న స్థానాల్లోనూ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులను నిలబెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని సమాచారం. అయితే జనసేనకు కేటాయించాల్సిన సీట్లల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో దించి, జనసేనకు వేరే స్థానాలను ఇచ్చేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని పార్టీవర్గాల నుండి గుసగుసలు వినబడుతున్నాయి.
జనసేన, టీడీపీ గెలుపొందే స్థానాల్లోనే అభ్యర్థులను బరిలో దించేందుకు చంద్రబాబు యోచిస్తున్నారని.. అందుకే మూడవ జాబితా విడుదల ఆలస్యం అవుతోందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా చంద్రబాబు అధికారికంగా ప్రకటించలేదు. వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరిన ముగ్గురు ఎంపీలకు టికెట్ ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగానే అభ్యర్థుల నియామకం ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
Read More..