'తప్పు అని తెలిసినా.. జగన్ మొదటినుంచి అదే చేస్తున్నారు'
వైసీపీ సర్కార్, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ''అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదు. రాష్ట్రంలో సీఎం జగన్ మొదటి నుంచీ ఇదే చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్టాత్మకమైన VIT, SRM వంటి విద్యా సంస్థలు వచ్చాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం, మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి!. ఆయా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు.. కానీ అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇటువంటి ఆలోచనలు రాష్ట్రానికి కూడా గౌరవం కాదు.'' అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదు. రాష్ట్రంలో సీఎం @ysjagan మొదటి నుంచి ఇదే చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్టాత్మకమైన VIT, SRM వంటి విద్యా సంస్థలు వచ్చాయి.(1/3) pic.twitter.com/gACcNyHMQF
— N Chandrababu Naidu (@ncbn) October 10, 2022