పల్నాడు అల్లర్లపై సీఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీల సస్పెండ్
పల్నాడు అల్లర్లపై సీఈసీ సీరియస్ అయింది.
దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు అల్లర్లపై సీఈసీ సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపుతిలో పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఎన్నికల అనంతరం హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. విచారణ తర్వాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగిన చోట బలగాలను కొనసాగించాలని తెలిపింది.