‘ఏపీలో భారీ భూ కుంభ కోణం’.. జగన్‌ను మరింత ఇరుకున పెట్టేలా బుద్ధా వెంకన్న కీలక నిర్ణయం

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బుద్ధా మీడియాతో

Update: 2024-07-09 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బుద్ధా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వానికి అవసరంలేని భూమి కొనుగోలు చేసి వేల కోట్ల స్కామ్‌కు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రాష్ట్రంలో కళ్లకు కనపడని కొత్త స్కామ్‌ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జరిగిన భూ కుంభ కోణాలపై డీజీపీకి కంప్లైట్ చేశానని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి రిఫర్ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని బుద్ధా వెల్లడించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లలో భారీ స్కామ్ జరిగిందని, దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని బుద్ధా వెంకన్న ఇవాళ డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీకి కలిసి వినతిపత్రం అందజేశారు. బుద్ధా విజ్ఞప్తి పాజిటివ్‌గా రెస్పాండ్ అయిన డీజీపీ.. టీడీఆర్ బాండ్ల ఇష్యూను సీఐడీ చేత విచారణ చేయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలోకి సీఐడీ ఎంటర్ కావడంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. వైసీపీ హయాంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సీఐడీ చేత జగన్‌ను బాబు సర్కార్ ఇరుకున పెట్టబోతుందా అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. 


Similar News