దయచేసి అలా చేయొద్దు.. టీడీపీ నేత హత్యపై ఎంపీ తీవ్ర భావోద్వేగం
కర్నూలు (Kurnool)లో టీడీపీ నేత హత్య (TDP Leader Murder) పట్ల పార్టీ ఎంపీ (TDP MP) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు (Kurnool)లో టీడీపీ నేత హత్య (TDP Leader Murder) పట్ల పార్టీ ఎంపీ (TDP MP) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కర్నూలులో సంజన్న అనే టీడీపీ నేతను కొందరు దుండగులు దారుణంగా హత్య గావించారు. సంజన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి (Baireddy Shabari).. మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె హత్య విషయంపై మాట్లాడుతూ.. చలించిపోయారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీ కార్యకర్తను తన కుటుంబంతో సమానం అనుకున్నానని అన్నారు. తన కుటుంబంతో సమానమైన కార్యకర్తను పోగోట్టుకున్నానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో, మీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు చంపుకోవడాలు చేయవద్దని, దీని వల్ల కుటుంబాలు నాశనం అవుతాయని చెప్పారు.
చంపుకోవడాలు లాంటివి చూసి, ఇలాంటివి వద్దు అనుకొని రాజకీయాల్లోకి వచ్చానని, కానీ ఇంతమంచి కార్యకర్తలను కోల్పోవడం బాధ కలుగుతుందని అన్నారు. దయచేసి చంపుకోవడాల జోలికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి (Request) చేశారు. ఏదైనా సమస్య వస్తే చట్టం, పోలీసులు (Police) ఉన్నాయని, చంపుకోవడాలు చేయవద్దని చెప్పారు. సంజన్న కుటుంబానికి తాను అండగా ఉంటానని, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరం చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడే వరకు పోరాడుతామని టీడీపీ నేత వెల్లడించారు. కాగా కర్నూలులో హత్యకు గురైన టీడీపీ నేత సంజన్న ఎన్నికలకు ముందు కాటసాని వర్గంతో విభేదించి, వైసీపీని వీడి టీడీపీలో చేరారు.