BREAKING: అనుభవంతో చెబుతున్నా.. ఆ పార్టీ చిత్తుగా ఓడిపోబోతోంది: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13తో ముగిసింది. అందుకు సంబంధించి జూన్ 4న ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

Update: 2024-05-21 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13తో ముగిసింది. అందుకు సంబంధించి జూన్ 4న ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలువడబోయే ఫలితాల్లో వైసీపీ పార్టీకి ఘోర పరాభవం తప్పదని, చిత్తుచిత్తుగా ఓడిపోబోతోందంటూ కామెంట్ చేశారు. ఇవాళ ఆయన జాతీయా మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. జగన్ ఓటమి ఖరారయ్యిందంటూ బాంబు పేల్చారు. రాజకీయ వ్యూహకర్తగా గత పదేళ్లుగా పనిచేస్తున్నానని, ఎక్కడ ఎవరు గెలుస్తారో, ఎవరి ఓడతారో తనకు పూర్తిగా తెలుసని అన్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కూటమిపై కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం పోలింగ్ సరళిని బట్టి ఆంధ్రాలో చంద్రబాబు గెలుపుపై పూర్తి నమ్మకం వచ్చి ఉంటుందన్నారు. కానీ, కౌంటింగ్‌ రోజు వచ్చే ఫలితాల చూసి జగన్ కూడా మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. 

Tags:    

Similar News