Breaking: వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం.. త్వరలో ఎన్నికలు

వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు..

Update: 2024-08-29 14:06 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో రెండు స్థానాలు ఖాళీలు అయ్యాయి. ఈ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే  ఈ రెండు రాజ్యసభ స్థానాలను ఎన్డీయే కూటమినే దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలు అంతగా లేకపోవడంతో వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది.  దీంతో పార్టీ మారేందుకు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా  జగన్ పార్టీకి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వాలతో పాటు పదవులకు సైతం రాజీనామా చేశారు. దీంతో ఇద్దరి ఎంపీల రాజీనామాలకు త్వరగా ఆమోదం లభించింది.  వెంటనే రెండు స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ బులెటిన్‌లో నమోదు అయ్యాయి. 


Similar News