బ్రేకింగ్ న్యూస్..ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్
కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు శెట్టిబత్తుల రాజబాబు జనసేన అధిష్టానానికి తన రాజీనామాను లేఖ ద్వారా పంపారు.
దిశ,అమలాపురం:కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు శెట్టిబత్తుల రాజబాబు జనసేన అధిష్టానానికి తన రాజీనామాను లేఖ ద్వారా పంపారు. అమలాపురంలో పార్టీకి అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా గణనీయమైన ఓట్లను పొందారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో జనసేన పార్టీ జిల్లాలో పుంజుకుందని తెలిపారు.
ప్రస్తుతం టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో జనసైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇంతకాలం గౌరవంగా జనసేన జెండాను మోసిన జనసైనికులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా కింద పని చేయాలని,ఈ మేరకు వారికి అన్యాయం చేసినట్లే అన్నారు. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించకుండా కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీకి తన క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శెట్టిబత్తుల రాజబాబు ప్రకటించారు.
Read More..
BREAKING: చంద్రబాబు అసలు మనిషా.. శాడిస్టా..? బస్ యాత్రలో బరెస్టైన సీఎం జగన్