BREAKING : తాడిపత్రి టికెట్ అతడికే కేటాయించిన చంద్రబాబు.. పంతం నెగ్గించుకున్న జేసీ బ్రదర్స్
ఎపీలో ఎలక్షన్ హాడావుడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని అనంతపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఎపీలో ఎలక్షన్ హాడావుడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని అనంతపురంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి టికెట్‌పై కొన్నిరోజులు ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఆ నీరీక్షణకు తెరదించుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ పరిణామంలో జేసీ బ్రదర్స్ పంతం నెగ్గించుకున్నారు. తమ కుమారుడికి టికెట్ కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబును దివాకర్‌రెడ్డి కోరారు. ప్రస్తుతం అధినేత నుంచి అధికారిక ప్రకటన రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు పవన్‌రెడ్డికి కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వాలని కోరగా.. బాబు ఇవ్వలేమని చెప్పినట్లుగా సమాచారం. కాగా, జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ లక్ష్యం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే పేర్కొ్న్నార. రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా.. రాకపోయినా బాధలేదని.. తాడిపత్రి నియోజకవర్గంలో తమకంటే కష్టపడే వారు ముందుకొస్తే స్వచ్ఛందంగా టికెట్ వదులుకుంటామి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.