BREAKING: ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేం: సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేమని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఓటింగ్ సరళి చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోలేమని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయన్ చేశారని ఆరోపించారు. ఏద ఏమైనా జగన్ చేసిన ప్రచారమే ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అన్నారు. కూటమి ఏర్పాటు తరువాత చంద్రబాబుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కనిపిస్తోందని కామెంట్ చేశారు. ఈసీ వైఫల్యం వల్లే ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులే సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎన్నికలు మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆ పార్టీ మాట్లాడటం లేదని తెలిపారు. ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే.. ఈ రకమైన హింసాత్మక ఘటనలు జరిగేవి కాదని అన్నారు. ఇప్పటికైనా ఈసీని నిష్పాక్షికంగా వ్యవహిరించాలని కోరుతున్నామని సజ్జల విజ్ఞప్తి చేశారు.