బ్యాటరీ వాహనం ఢీకొని బాలుడు మృతి..

బ్యాటరీ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన జూ పార్క్ రోడ్ లో బుధవారం చోటు చేసుకుంది.

Update: 2023-05-03 17:10 GMT

దిశ, తిరుపతి: బ్యాటరీ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన జూ పార్క్ రోడ్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయల్ నగర్ కు చెందిన సుబ్బరత్న సుష్మ కుమారుడు ప్రణవ్(3) గా పోలీసులు గుర్తించారు. సుష్మ ముగ్గురు పిల్లలతో పాటు అన్న కుమారుడుతో జూ పార్క్ సందర్శనం కోసం వెళ్లారు. ఈ నేపధ్యంలో జూ పార్కులో నున్న ఓ షాపు ముందు తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న మూడు సంవత్సరాల బాలుడిని బ్యాటరీ వెహికల్ డీ కొంది.

దీంతో బాలునికి తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడే పని చేస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం లో రుయా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి మార్చురీకి తరలించారు. బ్యాటరీ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అతి జాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎంఆర్ పల్లి పోలీసులు.

Tags:    

Similar News