Ap News: పోలవరంపై బీజేపీ ఫోకస్.. త్వరలో ప్రాజెక్టు పరిశీలనకు రాష్ట్ర అధ్యక్షురాలు

త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు....

Update: 2023-12-16 11:41 GMT
Ap News: పోలవరంపై బీజేపీ ఫోకస్.. త్వరలో ప్రాజెక్టు పరిశీలనకు రాష్ట్ర అధ్యక్షురాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో లక్షకు పైగా ఇళ్లు మంజూరు చేశామన్నారు.


కేంద్ర ఇచ్చే నిధులతో జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేశామని పురంధేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News