వారణాసిలో ఎంపీ జీవీఎల్ సందడి.. గంగా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వారణాసిలో గంగా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు...

Update: 2023-04-07 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వారణాసిలో గంగా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వారణాసిలో గంగా పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించడానికి సమావేశం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీకైన జీవీఎల్ నరసింహారావు ఆయన నోడల్ జిల్లా వారణాసి. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ గంగా పుష్కరాలకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో వారణాసి జిల్లా యంత్రాంగం యాత్రికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ రాజలింగం, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, వివిధ తెలుగు ఆశ్రమాలు, ధర్మశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి ముందు ఎంపీ జీవీఎల్ కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుని వివిధ గంగా ఘాట్‌లను సందర్శించి యాత్రికుల సౌకర్యాలను పరిశీలించారు.

Tags:    

Similar News