BJP: అంబటికి దేవుడిపై నమ్మకం లేదు.. ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
తిరుమల(TTD)లో మాజీమంత్రి అంబటి రాంబాబు(EX Minister Ambati Rambabu) వ్యవహార శైలిపై ఫిర్యాదు(Complaint) చేస్తామని ఎంపీ సీఎం రమేష్(MP CM Ramesh) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల(TTD)లో మాజీమంత్రి అంబటి రాంబాబు(EX Minister Ambati Rambabu) వ్యవహార శైలిపై ఫిర్యాదు(Complaint) చేస్తామని ఎంపీ సీఎం రమేష్(MP CM Ramesh) అన్నారు. సోమవారం తిరుమలలో సీఎం రమేష్, రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్(K Laxman) సహా ఇతర బీజేపీ నాయకులు(BJP Leaders) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. అంబటి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం ఉన్నప్పటికీ అంబటి రాంబాబు పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ(YS Jagan Photo) ఉన్న బ్యాడ్జ్(badge)తో ఆలయంలోకి రావడం దారుణమని అన్నారు.
అంబటికి భగవంతుడిపై నమ్మకం లేదని, ఎన్నికల్లో వైసీపీ పార్టీ(YCP Party)కి భగవంతుడు శిక్ష వేసినా వారికి భయం లేదని విమర్శలు చేశారు. అంతేగాక అంబటి తీరుపై ఫిర్యాదు చేస్తామని సీఎం రమేష్ చెప్పారు. కాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో ఆయన చొక్కాపై వైసీపీ అధినేత జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్ ఉండడం వివాదానికి దారితీసింది. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, స్టిక్కర్లతో స్వామివారి దర్శనానికి రావడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలోనే అంబటి జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో రావడం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.