గన్నవరంలో వైసీపీకి బిగ్‌ షాక్‌..! టీడీపీలోకి యార్లగడ్డ..?

రాజకీయ నాయకులు సొంత పార్టీ మీద అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి జంప్ అవుతూ ఉంటారు.

Update: 2023-08-12 08:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయ నాయకులు సొంత పార్టీ మీద అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి జంప్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీలోకి చేరిక అవ్వడం సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్‌ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగి, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.

వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో వల్లభనేని వంశీ వర్సెస్‌ యార్లగడ్డగా మారిపోయింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉండడం వల్ల వైసీపీ అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు నచ్చజెప్పిన కూడా సమస్య కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ వైసీపీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం.

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తొంది. ఈ నెల 19వ తేదీన లోకేష్‌ యువగళం పాదయాత్ర కృష్ణ జిల్లాకి చేరుకోన్న క్రమంలో లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాజకీయ సమీకరణాలు గన్నవరంలో వేగంగా మారుతున్నాయి. గన్నవరంలో కార్యకర్తలతో యార్లగడ్డ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని, అది రాకపోతే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తారని క్యాడర్‌ చెబుతుంది. మరోవైపు ఈ వ్యవహరంపై సోషల్ మీడియాలో సైతం జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News