APSRTC: వాళ్లకు రాయితీ టికెట్ల జారీపై ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులకు టికెట్లపై రాయితీ వస్తుంది. తాజాగా వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలపై సిబ్బందికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులకు టికెట్లపై రాయితీ వస్తుంది. తాజాగా వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలపై సిబ్బందికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీకి అందిన ఫిర్యాదుతో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అన్ని బస్సుల్లోనూ రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. టికెట్ ధరలో వృద్ధులకు 25 శాతం రాయితీ ఇవ్వాలన్న ఏపీఎస్ ఆర్టీసీ.. వారు తమ వయసు నిర్ధారణకు 6 ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదొక కార్డు చూపాలని తెలిపింది. ఆధార్ (Aadhar Card), సీనియర్ సిటిజన్, పాన్ కార్డు (Pan Card), ఓటర్ కార్డు (Voter Card), పాస్ పోర్ట్ (Passport), రేషన్ కార్డు (Ration Card)ల్లో ఏదేని కార్డు చూపించి బస్సుల్లో టికెట్లపై రాయితీ (Discount on bus Tickets) పొందవచ్చని పేర్కొంది. వృద్ధులపట్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.