Breaking:ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీఐ (RTI) కమిషనర్లు నియామకం.. వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు RTI కమిషనర్లను నియమించాలని ఏపీ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు RTI కమిషనర్లను నియమించాలని ఏపీ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ రోజు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ.. ఆర్టీఐ (RTI) కమిషనర్లు నియమిస్తున్నట్లు చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక Ntv జర్నలిస్ట్ రెహానా బేగం, డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, క్రీడాకారుడు సునీల్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీఐ (RTI) కమిషనర్లుగా నియమితులైయ్యారు.
కాగా కమిషనర్లుగా నియమితులైన వాళ్ళు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు విధుల్లో కొనసాగాలనే నిబంధనలను చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆర్టీఐ కమిషనర్ గా నియమితులైన తొలి మహిళ రెహానా బేగం. ఎందుకంటే విభజన తరువాత ఏ మహిళ ఆర్టీఐ (RTI) కమిషనర్ గా నియమించబడలేదు.