APCC: దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించు.. జగన్ కు వైఎస్ షర్మిల ఛాలెంజ్
అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ఆస్కార్ అవార్డు(Askar Award) ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) ఎద్దేవా చేశారు.
దిశ, వెబ్ డెస్క్: అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ఆస్కార్ అవార్డు(Askar Award) ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress President) వైఎస్ షర్మిల(YS Sharmila) ఎద్దేవా చేశారు. అదానీ అంశం(Adani Issue)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడిగారు. అదానీ కంపెనీ నుంచి యూనిట్ కు 50పైసలు ఎక్కువ పెట్టి కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా ? అని, అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా ? దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతేగాక అమెరికా దర్యాప్తు సంస్థలు(American Agencies) ఇచ్చిన రిపోర్ట్ లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్.. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్(Andrapradesh CM) అంటే ఆనాడు మీరు కాదా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదని, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్బీఐ(FBI), ఎస్ఈసీ(SEC) స్వయంగా రిపోర్ట్(Report) ఇచ్చాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం(TDP Govt) ఎక్కువ ధరకు పీపీఎల్(PPL) చేసుకుందని చెప్పే మీరు.. అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా ? టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు ? ఎందుకు విచారణ జరిపించలేదు ? అని నిలదీశారు. ఇక రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయిందని అన్నారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి అని, దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలని షర్మిల వ్యాఖ్యానించారు.