AP Politics:వైసీపీకి బిగ్ షాక్..?
వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు సమాచారం.
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు సమాచారం. వైసీపీకి చెందిన ఛైర్మన్, అధికార పార్టీలో చేరేందుకే బయలుదేరి వెళ్లినట్లు కుప్పంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రితో మున్సిపల్ చైర్మన్ సుధీర్ మంతనాలు జరిపి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చెందడంతో పలువురు వైసీపీ నేతల్లో అసహనం నెలకొంది. కేవలం వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు పార్టీ నేతల నుంచి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వైదొలిగి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఛైర్మన్ సహా మెజారిటీ వెసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. మరోవైపు చిత్తూరు కార్పొరేషన్‌లో మేయరు, పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరడంతో కౌన్సిల్ కూటమి వశమైంది. ఇక, పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీలో కూడా చేరికలకు మార్గం ఏర్పడిందని చెబుతున్నారు.